telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

తెలంగాణలో 1,85,833కు చేరిన కరోనా కేసుల సంఖ్య

Corona

తెలంగాణ‌లో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,967 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో తొమ్మిది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,058 మంది కోవిడ్ బారినుంచి కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,85,833కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,54,499 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,100కు చేరింది. ప్రస్తుతం 30,234 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 297 కేసులు నమోదయ్యాయి.

Related posts