telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇక కిస్ సీన్స్ బ్యాన్… కరోనా ఎఫెక్ట్…!!

China

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభలుతున్న నేపధ్యంలో తైవాన్‌లో రూపొందించే సీరియల్స్‌లో కిస్సింగ్ సీన్స్‌ను బ్యాన్ చేశారు. తైవాన్‌కు చెందిన ఫోర్మోసా టీవీలో ప్రసారమయ్యే సీరియల్ గోల్డల్ సిటీలో నటి మియా చివూ, నటుడు జూన్ ఫూ మధ్య కిస్సింగ్ సీన్స్ వస్తుంటాయి. చైనాలోని వుహాన్ పట్టణంలో కరోనా వైరస్ ప్రభావం అత్యధికంగా ఉంది. ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు సీరియల్స్‌లో కిస్సింగ్ సీన్స్ ఉండకూడదని తైవాన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తైవాన్‌లోని టీవీ కళాకారులకు అక్కడి ప్రభుత్వం కొన్ని ఆదేశాలు జారీ చేసింది. సీరియల్స్‌లో కిస్సింగ్ సీన్స్ ఉండకూడదని, కళాకారులు షూటింగ్ సమయంలో దగ్గరగా ఉంటూ మాట్లాడుకోకూడదని తెలిపింది. కరోనా వైరస్ ప్రభలకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఈ సందర్భంగా నటి చీవూ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

Related posts