telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

దేశంలో కరోనా మహోగ్రరూపం.. ఒక్కరోజులో 38,902 కేసులు

corona vairus

దేశంలో కరోనా వైరస్ మహోగ్రరూపం దాల్చడంతో కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత 24 గంటల్లో భారత్‌లో 38,902 మందికి కొత్తగా కరోనా సోకిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 543 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 10,77,618కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 26,816కి పెరిగింది. 3,73,379 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 6,77,423 మంది కోలుకున్నారు.నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,37,91,869 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

Related posts