బీసీల పట్ల కాంగ్రెస్కు నిజాయితీ, చిత్తశుద్ధి లేదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పరువు తీసుకుందన్నారు.
కాంగ్రెస్ ఇంత మూర్ఖంగా వ్యవహరిస్తుందని ఎవరూ అనుకోలేదని ఈటల అన్నారు. తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి వంచించారని మండిపడ్డారు. కాంగ్రెస్కు సలహాలు ఇచ్చింది ఎవరో అర్థం కాలేదని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ అంశం రాజ్యాంగానికి సంబంధించినదన్నారు. కాంగ్రెస్ నేతలు చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరిపించాలని పట్టుబడ్డారు. హామీ ఇచ్చే ముందు కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందో తెలియదా అని ప్రశ్నించారు.
ఎన్నికల్లోపు పాత సర్పంచ్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత్ చురకలు