telugu navyamedia
తెలంగాణ వార్తలు

మంత్రి హ‌రీష్‌రావు క‌లిసిన బాల‌య్య‌..

తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంద్రి త‌న్నీరు హ‌రీష్ రావును, సినీ నటుడు, హిందూపూరం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ మర్యాదపూర్వకంగా సోమ‌వారం క‌లిశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ప్ర‌తినిధులు, బాల‌య్య‌ మంత్రితో స‌మావేశమ‌య్యారు.

ఈ సందర్భంగా బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూల్‌ అందిస్తున్న సేవలను, సంస్థ కార్యకలాపాలను బాలకృష్ణ మంత్రి హరీష్‌రావుకు వివరించారు. ఆస్పత్రి అభివృద్ధి అంశాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం తమకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బాల‌కృష్ణ చేసిన విజ్ఞ‌ప్తికి మంత్రి హ‌రీష్ రావు సానుకూలంగా స్పందించారు.

మంత్రి హరీశ్‌ రావును కలిసిన అఖండ బాలయ్య - Great Telangaana TDP MLA Balakrishna meets Minister Harishrao

కాగా.. పేద‌ల‌కు చికిత్స అందుబాటులో తేవ‌డానికి సీనియ‌ర్ ఎన్టీఆర్ స‌తీమ‌ణి, త‌న త‌ల్లి బ‌స‌వ‌తార‌కం పేరు మీద ఈ ఆసుప‌త్రిని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే

Related posts