టాలీవుడ్ సీనియర్ హీరో మంచు మోహన్ బాబు ఆయన తనయుడు, ‘మా’ అధ్యక్షుడు విష్ణు తీరుపై మండి పడుతున్నారు. విష్ణు పై నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విష్ణు హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీను రూ. లక్షలు విలువ గల వస్తువులు దొంగతనం చేశారని ఇటీవల జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఉద్దేశపూర్వకంగానే చోరీ కేసు నమోదు చేశారన్న ఆరోపణలు మంచు ఫ్యామిలీపై ఉన్నాయి.
తనను చిత్రహింసలకు గురి చేసి కులం, వృత్తి పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ వ్యవహారంలో నాగశ్రీనుతోపాటు బీసీలందరికీ మంచు కుటుంబం క్షమాపణ చెప్పాలంటూ బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణుపై నాయీ బ్రాహ్మణ సంఘాల నేతలు తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. బీసీ కులాల్లో అత్యంత వెనుకబడిన నాయీ బ్రాహ్మణ కులాన్ని మోహన్ బాబు, విష్ణు తక్కువ చేసి మాట్లాడడం పద్ధతి కాదు.వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాకుండా.. మంచు ఫ్యామిలీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా కులాల పేరుతో దాడులు జరుగుతుండటం సిగ్గుచేటు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరి మాకు కూడా చట్టం తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన డిమాండ్ చేశారు.
ఎన్నో ఏళ్లగా మోహన్‌బాబు ఇంట్లో హెయిర్ డ్రెసర్‌గా మచ్చ లేకుండా పని చేస్తున్న నాగశ్రీనుపై దొంగతనం బనాయించడమే కాకుండా కులం పేరుతో దూషించి మనోభావాలు దెబ్బతీశారని శ్రీనివాస్ పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ బయట పెడితే ఎవరు అసలైన దొంగో తెలుస్తుందన్నారు.


సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ లుక్… ఫుల్లుగా ఎంజాయ్ చేశా అంటున్న లావణ్య