తెలుగు చిత్రసీమలో ‘మా’ ఎన్నికల నేపథ్యంలో కొత్తవివాదం తెరపైకి వచ్చింది. మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణుపై పోటీ చేసి ఓడి పోయారు..ఇండస్ట్రీలో ఇన్నేళ్ళుగా ఇంత సేవ చేస్తుంటే.. నన్ను నాన్ లోకల్ అంటూ పబ్లిసిటీ చేసి ఇండస్ట్రీ నుండి వేరు చేస్తారా అంటూ.. తీవ్ర ఆవేదనతో ప్రకాశ్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేయగా.. ప్రకాష్ కి సపోర్టుగా నాగబాబు, శివాజీరాజా కూడా రాజీనామా చేశారు.
అయితేజ.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి పోటీలో నిలబడి గెలిచిన శ్రీకాంత్‌తోపాటు ఇతర సభ్యులు కూడా రాజీనామా చేయాలని చూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి ఈ మంగళవారం సాయంత్రం 5 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. ఈ క్రమంలో వీరంతా మంగళవారం సాయంత్రం 5 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. ‘మా’కు పోటీగా మరో అసోసియేషన్ ఏర్పాటు చేసిన దానికి ‘ఆత్మ'(ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అని పేరు పెట్టనున్నారని తెలుస్తోంది.
ఈ అనూహ్య నిర్ణయాలకు మంచు కుటుంబం కూడా కారణమని అంటున్నారు. కుల, మత, ప్రాంతాలకి అతీతమైన సిని మా ఎన్నికల్లో ప్రాంతీయవాదం తీసుకొచ్చి ప్రకాశ్ రాజ్ ని ఓడించటంలో మంచు ప్యానల్ సక్సెస్ అయ్యిందని.. కానీ ఇలాంటి ప్రచారం భవిష్యత్తులో ప్రమాదకరమని భావిస్తున్నారు కొందరు ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు