telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరు బర్త్ డేకు మెగా సర్ప్రైజ్… 65 మంది సెలెబ్రిటీలు కలిసి…!

chiru

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా హంగామా అప్పుడే మొదలు పెట్టేశారు. చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా చాలా గ్రాండ్‌గా కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మొత్తం అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి 65 మంది ప్రముఖులు కలిసి చిరంజీవి కామన్ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించనున్నట్లు ఈ వీడియో ద్వారా తెలిపారు. ఇది ఇలా జరగడం ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అని సినీ విశ్లేక్షలు భావిస్తున్నారు. ఇక అటు ఫ్యాన్ బర్త్‌డే కామన్ డిస్ల్పే పిక్ (సీడీపీ) మొదలుకొని అడ్వాన్స్ ట్రెండ్, బర్త్‌డే ట్రెండ్ క్రియేట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “ఆచార్య” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Related posts