కోల్ ఇండియా బొగ్గు గనిలో బుధవారం జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మహానంది గనిలో పైకప్పు కూలడం జరిగిన ప్రమాదంలో నలుగురు గని కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. బొగ్గుగనిలో జరిగిన ప్రమాదంతో గనిలో బొగ్గు వెలికితీతను నిలిపివేశామని కోల్ ఇండియా ప్రతినిధి మెహ్రా చెప్పారు. గనిలో వారం రోజుల అనంతరం బొగ్గు వెలికితీస్తామని మెహ్రా పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబరులో మేఘాలయలోనూ బొగ్గు గనుల్లో జరిగిన ప్రమాదంలో 15 మంది మరణించారు.

