telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోండి : సీఎం జగన్

cm jagan ycp

సీఎం వైయస్‌ జగన్‌ కరోనా నియంత్రణ, నివారణ, వాక్సినేషన్‌పై క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో బ్లాక్‌ ఫంగస్‌ విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోండి అని సీఎం తెలిపారు. ఇంజక్షన్లు తెప్పించుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టండి. వైట్‌ ఫంగస్, ఎల్లో ఫంగస్‌లపైనా సమాచారం వస్తోంది. వాటిపైనా పూర్తి అప్రమత్తంగా ఉండండి అని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. అలాగే కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన 34 మంది పిల్లలను ఇప్పటి వరకు గుర్తించామన్నారు అధికారులు. వారందరి పేరు మీద వెంటనే రూ.10 లక్షల చొప్పున డిపాజిట్‌ చేయాలని సీఎం ఆదేశించారు. ఇక తుఫాను కారణంగా తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం… వెంటనే విశాఖపట్నం వెళ్లాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసారు. సీఎం ఆదేశాలతో విశాఖకు వెళ్ళాడు సీఎస్‌. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts