దేశ రాజదాని ఢిల్లీలో రాష్ర్టపతి ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము ఎంపికిచేయడంపై సర్వత్రా హర్షవ్యక్తమవుతోంది.ఈ క్రమంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజనులు, బీజేపీ నేతలతో కలిసి డాన్స్ చేసి సందడి చేశారు.
సీఎం శివరాజ్ సింగ్గిరిజనుల వేషధారణతో దుస్తులు ధరించి, చేతుల్లో నెమలి ఈకలు, విల్లు చేతబట్టి గిరిజన మహిళలతో కలిసి పాటకు డాన్స్ చేశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎంపిక చేసి బీజేపీ చాలా గొప్ప నిర్ణయం తీసుకుంది, ఇందుకు తాను చాలా సంతోషిస్తున్నట్లు సీఎం చౌహాన్ ట్విట్టర్లో పంచుకున్నారు.
![]()
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు చేయడానికి ముందు న్యూఢిల్లీకి వెళ్లారు. మరికాసేపట్లో నామినేషన్ వేయనున్నారు.
కాగా.శివరాజ్ సింగ్ చౌహాన్ గిరిజనుల వేషధారణతో నృత్యం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
आदरणीय श्रीमती द्रौपदी मुर्मू जी को राष्ट्रपति पद की उम्मीदवार बनाने पर मा. प्रधानमंत्री श्री @narendramodi जी एवं राष्ट्रीय नेतृत्व के आभार कार्यक्रम से पूर्व जनजातीय भाई-बहनों के साथ उनके अद्वितीय लोक नृत्य एवं संगीत का साथी श्री @vdsharmabjp जी के साथ आनंद लिया। pic.twitter.com/aiN9yJELvk
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) June 23, 2022


పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమే: ఆర్జీవీ