*ప్రారంభమైన ఏపీ కేబినేట్ సమావేశం..
*సీఎం జగన్ అధ్యక్షన ఏపీ కేబినేట్ భేటి
*పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపే ఛాన్స్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రి వర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు. దీనిలో భాగంగా మూడో విడత ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
ఈనెల 27వ తేదీన అమ్మ ఒడి నిధులను ప్రభుత్వం విడుదల, జులైలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వాహన మిత్ర, కాపు నేస్తం పథకాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.