సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం : బాధితులకు ప్రభుత్వం తరుఫున అండగా ఉంటాం. ఇలాంటి ప్రమాదం తెలంగాణలో ఇప్పటివరకు జరగలేదు.
సిగాచి ప్రమాదం దురదృష్టకరం, అత్యంత విషాద ఘటన. అన్ని శాఖలు సమన్వయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నాం.
మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం అందించాలని ఆదేశిస్తున్నాం. గాయపడి పనిచేయని స్థితిలో ఉన్న బాధితులకు రూ.10 లక్షలు.
దుర్ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో 143 మంది ఉన్నారు. ప్రమాదంపై అత్యున్నత కమిటీతో విచారణ జరిపిస్తాం.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. మృతులు, గాయపడిన వారి పిల్లల చదువుల బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.
ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం మా దగ్గర ఉంది. విచారణ జరిగి నివేదిక వచ్చాక పూర్తి వివరాలు వెల్లడిస్తాం :సీఎం రేవంత్ రెడ్డి


వైసీపీ సర్కారు వైఖరితో రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు: సోమిరెడ్డి