telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం: సీఎం రేవంత్ రెడ్డి – సీపీఐ నేతలతో సీఎం భేటీ

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు.

సీపీఐ నాయకులు, ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు గారు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి గారితో పాటు పలువురు నేతలు ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిశారు.

గ్రామ పంచాయతీ కార్మికులు, అంగన్ వాడీ, ఆర్టీసీతో పాటు పలు ప్రజా సమస్యలపై వారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారితో చర్చించారు. అలాగే, పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలను వివరించారు.

Related posts