తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షునిగా మరోసారి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ విషయాన్ని సోమవారం జరిగే పార్టీ ప్లీనరీలో లాంఛనంగా ప్రకటించనున్నారు. తెరాస పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు భవిష్యత్తులో అనుసరించనున్న వైఖరిపై శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు భవిష్యత్తులో అనుసరించనున్న వైఖరిపై శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే తరహాలో పార్టీ పటిష్ఠానికి త్వరలో మంత్రి కేటీఆర్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నాయి.

2001 ఏప్రిల్ 27న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 12 మంది 12 మంది ప్రతినిధులతో కలిసి టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. ఆ తర్వాత జరిగిన పలు ప్లీనరీల్లో ఆయన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయనే అధ్యక్షుడు కానున్నారు. దేశంలో సుదీర్ఘకాలం పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్న వారిలో కేసీఆర్ ఒకరు. జలదృశ్యంలోని కొండాలక్ష్మణ్ బాపూజీ నివాసంలో పురుడుపోసుకున్న టీఆర్‌ఎస్ నేటికి 20 ఏళ్ళు ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్… ఉపసభాపతి, సిద్దిపేట ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెరాసను స్థాపించారు. ఆ తర్వాత ఉద్యమపంథాలోనే పార్టీని నడిపించారు. 2014లో అధికారంలోకి వచ్చాక పార్టీ నిర్మాణంపై కేసీఆర్ దృష్టి సారించారు. సంస్థాగత ఎన్నికలకు ప్రాధాన్యమిచ్చారు.
2018 డిసెంబరులో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు కేటీ రామారావుకు అప్పగించారు. గత రెండేళ్లుగా ఆయన ప్రణాళికాబద్ధంగా పార్టీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పార్టీపరంగా కార్యకర్తలను ఆదుకోవడంతో పాటు ఆధునిక హంగులతో వారిని సుశిక్షితులను చేస్తున్నారు.
కాగా.. టీఆర్‌ఎస్ ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ప్లీనరీకి వివిధ జిల్లాల నుంచి పలువురు టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులుతో పాటు మొత్తం 6 వేల మంది వరకు తరలిరానున్నారు.

