రైైల్వే శాఖ కొత్త సంవత్సరం ఆరంభం రోజే టిక్కెట్ ఛార్జీలు పెంచింది. ఈ రోజు నుంచే ఆ ధరలు అమలులోకి రానున్నాయి. స్వల్ప మొత్తమే పెంచడం ఎంఎంటీఎస్ రైలు ప్రయాణికులకు ఊరటే. నగర ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ తర్వాత ఎంఎంటీఎస్ (సబర్బన్) కీలకమైంది.
ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, రైలు ఛార్జీల ధరలు పెంచారు. ప్యాసింజర్ (ఆర్డినరీ) సెకండ్, స్లీపర్, ఫస్ట్ క్లాస్‌లకు కిలోమీటర్‌కు ఒక పైసా, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో సెకండ్, స్లీపర్, ఫస్ట్‌క్లాస్‌లకు 2 పైసల చొప్పున పెంచారు. ఏసీ ఛైర్‌కార్, త్రీటైర్, టూటైర్, ఫస్ట్‌క్లాస్‌లో కిలోమీటర్‌కు 4 పైసల చొప్పున పెంచడం గమనార్హం. ఎంఎంటీఎస్ (సబర్బన్), ఎంఎంటీఎస్, ప్యాసింజర్ సీజన్ టిక్కెట్ ఛార్జీలు పెరగలేదు.
ఇళయరాజాపై నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు