తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో అర్బన్ పాలసీ రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు. నూతన అర్బన్ పాలసీలో మున్సిపల్ చట్టం, కార్పొరేషన్స్ చట్టం హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టం తీసుకురావాలని సూచించారు.అవినీతికి ఆస్కారం లేకుండా సేవలు అందేలా అర్బన్ పాలసీ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. త్వరలో అసెంబ్లీని సమావేశ పరిచి కొత్త చట్టాలు తెస్తామని చెప్పారు.
అక్రమ కట్టడాలకు ఏ మాత్రం వీలులేని విధంగా కొత్త చట్టాలు ఉండాలన్నారు. బాధ్యతలను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం ఉండాలని సీఎం పేర్కొన్నారు.కొత్త రూరల్ పాలసీ, కొత్త రెవెన్యూ పాలసీ కూడా రూపొందించాలని చెప్పారు.రెండు మూడు రోజుల్లోనే ఈ చట్టాల డ్రాఫ్ట్ తయారు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.