telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

విద్యార్థులు పొరాడి విజయం సాధించాలి: చినజీయర్‌

chinna-jeeyar-swamy

తెలంగాణ ఇంటర్ బోర్డ్ తప్పిదాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలంలోని ధనరాశి పర్వతంపై గల శ్రీరాధాకృష్ణ దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..ఇంటర్‌ ఫలితాల తప్పుల కారణంగావిద్యార్థులు బలయ్యారని అన్నారు.

తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించి, గట్టిగా నిలబడి పొరాడి విజయం సాధించాలని విద్యార్థులకు సూచించారు. ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు పోరాడి పరిష్కరించుకోవాలని సూచించారు. పిల్లల్లో మనోబలం, ఆత్మవిశ్వాసం పెరగాలంటే దేవుడిపై భక్తి, విశ్వాసాన్ని పిల్లల్లో పెంపొందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని చినజీయర్‌ స్వామి తెలిపారు.

Related posts