telugu navyamedia
తెలంగాణ వార్తలు

కలెక్టర్లు ఇక పల్లెబాట..

యాసంగిలో వేసే పంటల్లో వరిధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గసభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, జిల్లా కలెక్టర్లతో సుధీర్ఘంగా చర్చించారు. కలెక్టర్లు, వ్యవసాయాధికారులు గ్రామాలకెళ్లి రైతులకు అర్థమయ్యే విధంగా వివరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనబోమని పదే పదే స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్ ప్రస్తావించారు. రాబోయే వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల సాగుదిశగా రైతులను సమాయత్తం చేయాలని అధికారులకు దిశానిర్ధేశంచేశారు.

CM KCR to chair meeting with district collectors on Dec 18

మారిన పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొత్త జోనల్‌ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయితే అన్ని జిల్లాల్లోనూ, అన్ని ప్రాంతాల్లోనూ పాలన సజావుగా సాగుతుందన్నారు. తెలంగాణ జిల్లాల్లో అధికారయంత్రాంగం అన్నివిభాగాల్లోనూ రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్తజోనల్‌ విధానం అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో అందుకనుగుణంగానే ఉద్యోగుల విభజన ప్రక్రియ చేపట్టాలని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఉద్యోగుల విభజన ప్రక్రియ పారదర్శకంగా పూర్తి చేసి నాలుగైదు రోజుల్లో నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈనెల 20న ఉద్యోగులకు కొత్త జిల్లాల వారీగా విభజన ప్రక్రియ పూర్తి చేసి కేటాయింపులు చేయనున్నారు. ఈనేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు భారీగా బదిలీ అయ్యే అవకాశాలున్నాయని అధికారిక సమాచారం. ఉద్యోగులకు విభజనప్రకారం బాధ్యతలు కేటాయించిన తర్వాత వారం రోజుల్లోగా విధుల్లోకి చేరాల్సి ఉంటుందనే నిబంధన ఖచ్చింతంగా అమలు చేయడానికి చర్యలు తీసుకున్నారు.

వెనుకబడిన మారుమూల జిల్లాల్లో పాలన అందరికీ చేరాలనే ఉద్దేశంతో కొత్త జిల్లాలను ఏర్పాటు చేశామని, ఉద్యోగులు మారుమూల గ్రామాల్లోకి వెళ్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం స్పష్టం చేశారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే వారు ఒకే చోట పనిచేసే విధంగా వెసులుబాటు కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ క్రమంలో ..స్థానిక యువతకు ఉపాధిఅవకాశాలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా స్పౌస్‌ కేసులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కొత్త జోనల్‌ వ్యవస్థతో ప్రభుత్వ పాలన క్షేత్రస్థాయిలో అమలవుతుందని సీఎం పేర్కొన్నారు.

Related posts