సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.జయచంద్రారెడ్డి మృతి చెందారు. ఈ విషాద సమయంలో జయచంద్రారెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
జస్టిస్ జయచంద్రారెడ్డి మహోజ్వల వ్యక్తిత్వం కలిగినవారని, లా కమిషన్ చైర్మన్ గా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా ఆయన అందించిన సేవలు విలువైనవని కీర్తించారు. భారత న్యాయవ్యవస్థలో ఆయన భాగస్వామ్యం ఎన్నదగినదని పేర్కొన్నారు.

