*నెల్లూరులో సీఎం జగన్ పర్యటన
*రామాయపట్నం పోర్టు పనులను ప్రారంభించిన సీఎం జగన్
*సముద్రుడికి పట్టు వస్ర్తాలు సమర్పించిన జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా రామాయపట్నం పోర్ట్ కి శంకుస్థాపన చేసి భూమిపూజ నిర్వహించారు.
సీఎం జగన్ వెంట మంత్రులు అంబటి రాంబాబు, అమర్నాథ్ ఉన్నారు. స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి సీఎంకు జ్ఞాపిక అందజేశారు. పోర్ట్ పనులకు శంకుస్థాపన అనంతరం అక్కడినుంచి సముద్ర తీరం వరకు వెళ్లి సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సముద్రంలో ట్రెడ్జింగ్ పనుల్ని ప్రారంభించారు.
రామాయపట్నం పోర్టు పైలాన్ ను జగన్ ఆవిష్కరించారు. అనంతరం అక్కడ జరగనున్న బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించనున్నారు.
రామాయపట్నం ఓడ రేవును మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించనున్నట్టగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. తొలిదశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచింది. రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. ఇప్పటికే తొలి దశ టెండర్లను ఖరారు చేయడంతో భూమి పూజతో పనులు ప్రారంభం కానున్నాయి.