ఏపీలో ఏ రైతు ఆనందంగా లేరని దిక్కుతోచని పరిస్థితుల్లోనే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నేడు ఒంగోలు లో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతు సమస్యల పరిష్కారం పోరాటం చేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మీకు అండగా మేము ఉంటామని, రైతులకు మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.
మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరేసే పరిస్థితి తీసుకోస్తారా? అని మండిపడ్డారు. వ్యవసాయ మోటార్లు మీటర్లు బిగించడం వల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే తిరగబడాలని రైతులను కోరారు.
అమ్మ ఒడి అన్నారు.. నాన్న బుడ్డీ పెట్టారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తీసేశారు. విదేశీ విద్య, పెళ్లి కానుక పథకాలన్నీ ఏం చేశారు? అని ప్రశ్నింఆచరు.
రాష్ట్రంలోని ప్రజా సమస్యలపైనే మన పోరాటం అని చంద్రబాబు అన్నారు. పెట్రోల్ ధరలు కేంద్రం తగ్గించినా వైసీపీ ప్రభుత్వం తగ్గించడం లేదని అన్నారు. ఇంటిపన్ను, చెత్తపన్ను, డ్రైనేజీ ట్యాక్స్ అన్నీ పెంచేశారు.
శాసన మండలిని రద్దు చేయడం జగన్ వల్ల కాదు: యనమల