telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు

తూర్పు గోదావరి జిల్లా, గోపాలపురం నియోజకవర్గం, నల్లజర్ల మండలం, దూబచర్లగాంధీ కాలనీ లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు.

భారతరత్న అంబేద్కర్ను అగౌరవపరిచేలా విగ్రహం పట్ల దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఘటనపై డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి కుట్రతో ఇటువంటి నేరాలకు పాల్పడతున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలు, ఆయా వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించేవారిపట్ల అత్యంత కఠిన వ్యవహరించి, ఇటవుంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.

పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేవారిపై నిఘా ఉంచాలని సీఎం చంద్రబాబు సూచించారు.

Related posts