ఏపీలో లాక్ డౌన్ లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిత్యావసరాల కొనుగోలుకు అనుమతిస్తున్నారు. అయితే, ఈ సమయాన్ని తగ్గించాలని కొందరు మంత్రులు సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జగన్ స్పందిస్తూ సమయాన్ని తగ్గిస్తే ప్రజలు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చే అవకాశముందన్నారు.
దీంతో జనసమూహాలు ఏర్పడేందుకు తామే అవకాశం ఇచ్చినట్టు అవుతుందని సీఎం మంత్రులకు వివరించారు. ఈ సూచనను అమలు చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలన చేయాలని ఆయన మంత్రులకు సూచించారు. ప్రజల వద్దకే మొబైల్ రైతు బజార్లు, మొబైల్ నిత్యావసరాల దుకాణాలను తీసుకెళ్లగలం అన్న ధీమా ఉన్నప్పుడే సమయం తగ్గించే ఆలోచన చేద్దామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
జగన్ సీఎం కాబోతున్నారు.. ప్రజల నాడి చూసి చెబుతున్నా: రోజా