ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సూపర్ ఓవర్‌లో ఓటమిపాలైన విషయం తెలిసిందే. అయితే ఈ ఓటమిపై స్పందించిన కేన్ విలియమ్సన్.. సూపర్ ఓవర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘సూపర్ ఓవర్స్‌లో ఎదురైన ఓటములతో అలసిపోయాను. సూపర్ ఓవర్ ఎప్పుడున్నా.. చేజింగ్ టీమ్ ముందు కష్టతరమైన లక్ష్యాన్ని ఉంచాలి. కానీ ఈ మ్యాచ్ ఫలితం మాకు కలిసి రాలేదు. కానీ టోర్నీలో ముందుకుసాగేందుకు కావాల్సిన సానుకూల అంశాలు లభించాయి. క్రికెట్‌లో ఇలాంటి విచిత్రాలు జరుగుతూనే ఉంటాయి. మ్యాచ్‌లు టైగా ముగుస్తుంటాయి. కానీ ఈ మ్యాచ్‌లు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి. చూడటానికి కూడా బాగుంటాయి. చాలా సానుకూలాంశాలు లభించాయి. వీలైనంత త్వరగా ఢిల్లీలో అడుగుపెట్టి టీమ్ పెర్ఫామెన్స్‌పై మరింత ఫోకస్ పెడ్తాం’అని కేన్ విలియమ్సన్ చెప్పుకొచ్చాడు. 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో కేన్ విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్.. ఇంగ్లండ్ చేతిలో సూపర్ ఓవర్‌లోనే ఓడి విశ్వకిరిటాన్నీ చేజార్చుకుంది. తొలుత మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీయగా.. ఆ తర్వాత అది కూడా టై కావడంతో బౌండరీల లెక్కన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించారు. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఓ మ్యాచ్‌లో సూపర్ ఓవర్ కారణంగానే ఓటమి పాలైన కేన్ సేన.. 2019 జనవరిలో భారత్‌తో జరిగిన రెండు టీ20ల్లోనూ సూపర్ ఓవర్స్‌లోనే ఓటమిపాలైంది. ఇక ఐపీఎల్‌లో కేన్ విలియమ్సన్ ఆడిన రెండు సూపర్ ఓవర్స్‌లో ఓటమే ఎదురైంది.
previous post
next post