telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిరు పార్టీలో రజినీకాంత్, బాలకృష్ణ, వెంకటేష్…!

Chiru

చిరు ఇంట్లో పార్టీకి రజినీకాంత్, బాలకృష్ణ, రాధిక, సుహాసిని తదితరులు హాజరుకానున్నారు. అయితే ఇప్పుడెందుకు పార్టీ అంటే… సౌత్ ఇండియాకు చెందిన 80, 90 దశకాలలో నటించి గుర్తింపు పొందిన నటులు ‘క్లాస్ అఫ్ ఎయిటీస్’ పేరుతో ఓ క్లబ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ క్లబ్‌లో తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమ చెందిన నటీనటులు సభ్యులుగా ఉన్నారు. వారిలో ప్రధానంగా.. చిరంజీవి, రజిని కాంత్, వెంకటేష్, మోహన్ లాల్, బాలకృష్ణ, భాను చందర్, అర్జున్, సుమన్, రాధికా, సుహాసినీ, సుమలత, కుష్బూ ఎక్కువ యాక్టీవ్‌గా ఉంటూ ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రదేశంలో కలిసి గెట్ టు గెదర్ లా దీన్ని ఓ వేడుకలా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా ఈ వేడుక ఈ సంవత్సరం కూడా జరగనుంది. కాగా ఈ పార్టీకి ఈ సారి మెగాస్టార్ చిరంజీవి ఆతిథ్యం ఇవ్వాలని అనుకుంటున్నారట. చిరంజీవి ఇటీవలే కొత్తగా రీమోడలింగ్ చేయించిన తన ఇంటిలో పార్టీ ఇవ్వాలని భావిస్తున్నారని టాక్. ఈ పార్టీకి వివిధ పరిశ్రమలకు చెందిన తమ క్లబ్ మెంబర్స్ ఆహ్వానించి గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేయనున్నారని సమాచారం. చిరంజీవి తాజా సినిమా సైరా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. అది అలా ఉంటే చిరంజీవి మరో సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రి ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

Related posts