telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మీ కుటుంబానికి మీరే సర్వస్వం…” పవన్ ఫ్యాన్స్ మృతిపై చిరంజీవి

chiru

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబరాల్లో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. దాదాపు 25 అడుగుల ఫ్లెక్సీ కడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో పవన్ బర్త్ డే వేడుకల్లో భాగంగా ప్లెక్సీ కడుతుండగా.. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 10 మంది పవన్ అభిమానులకు కరెంట్ షాక్ తగిలింది. వీరిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా… మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా శాంతిపురం మండలం కడపల్లి గ్రామానికి చెందినవారు. ఈ ఘటన పై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. “చిత్తూర్ లో పవన్ పుట్టిన రోజుకి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభిమానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వం” అని చిరంజీవి ట్వీట్ చేశాడు.

Related posts