కరోనా కారణంగా తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తిరిగి బస్సులు పునరుద్ధరించాలన్న ఆలోచనలో తెలుగు రాష్ట్రాలు సంసిద్దమవుతున్నాయి. సమాన కిలోమీటర్ల మేరకు బస్సులను తిప్పేలా అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోవాలని టీఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేస్తూ ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు 1.12 లక్షల కిలోమీటర్లు అధికంగా తిరుగుతున్నాయని పేర్కొంది.
ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు లేఖ వచ్చింది. తాము 56 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, ఆ మేరకు తెలంగాణ బస్సు సర్వీసులను పెంచుకోవాలని ఈ లేఖలో ప్రతిపాదించారు. దీనిపై వెంటనే చర్చించి, బస్సులను నడిపిద్దామని ఈ లేఖలో రవాణా శాఖ చీఫ్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు సూచించారు.
మహారాష్ట్ర గవర్నర్ వ్యవహారంపై సోనియా అసంతృప్తి