వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు వర్షంలో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు .. వారి పట్ల శ్రద్ధ ఎక్కువగా తీసుకోవాలి. చినుకు పడితే చాలు.. చిన్నారులకు జలుబు, దగ్గు అంటూ.. రకరకాల సమస్యలు వస్తాయి. రోగనిరోధక శక్తి పిల్లల్లో తక్కువగా ఉంటుంది కాబట్టి.. వాళ్ల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి. మురుగు నీళ్లు.. వర్షపు నీళ్లు తాకి.. పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. క్రిమీకీటకాలు ఎక్కువగా టార్గెట్ చేసేది పిల్లల ఆరోగ్యం మీదే. కాబట్టి వర్షాకాలంలో చిన్నారుల ఆరోగ్యం, అలవాట్లపై చాలా అలర్ట్ గా ఉండాలి.

ఎక్కువగా ఈ కాలంలో దగ్గు, జ్వరం, డయేరియా మొదలైన సమస్యలు వస్తాయి. అందుకని పిల్లలకి తేలికగా జీర్ణమయ్యే ఆహారం ఇవ్వాలి. అలాగే రోగ నిరోధకశక్తిని పెంపొందించే ఆహారం, ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం ఇవ్వాలి. అలానే దోమలు కుట్టకుండా చూసుకోవడం, బయట ఆహారం తీసుకోకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.

వేడి నీళ్ళు..
కాచిన నీళ్లు వర్షాకాలంలో నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువ కాబట్టి.. కాచి చల్లార్చిన నీటినే ఇవ్వాలి. బయట దొరికే మజ్జిగ, నిమ్మరసం వంటి పండ్ల రసాలకు స్వస్తి చెప్పడం మంచిది. అలాగే ఐస్, కుల్ఫీ వంటి వాటికి దూరంగా పెట్టాలి.

తాజా పండ్లు..
పండ్లు వర్షాకాలం ఎక్కువగా దొరికే పియర్, బొప్పాయి, దానిమ్మ, నేరేడు, యాపిల్ వంటి పండ్లు ఎక్కువగా పిల్లలకు ఇవ్వాలి. ఇవి శరీరానికి అందడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

ఫాస్ట్ ఫుడ్ కి గుడ్ బై..
ఫాస్ట్ ఫుడ్ పిల్లలకు చాలా ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ కి వానాకాలంలో గుడ్ బై చెప్పాలి. ఇవి అనారోగ్య కారకాలు. ఈ కాలంలో పిల్లలకు పెట్టే ఆహారంలో పోషకాలు ఎక్కువ మోతాదులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

ప్రోటీన్స్..
ప్రోటీన్ పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. ప్రోటీన్ ఎక్కువగా చికెన్, గుడ్లు, పాలు, యోగర్ట్, పన్నీర్, కాటేజ్ చీజ్, సోయా, పీనట్ బటర్ లో ఉంటుంది. వీటిని ఇవ్వడం వల్ల రోగ నిరోధక శక్తి అందుతుంది.

ఐరన్..
బీన్స్, ఆకుకూరలు, గుడ్లు వంటి పదార్థాలలో ఐరన్ ఉంటుంది. ఐరన్ తక్కువగా ఉండడం వల్ల ఎనీమియా సమస్య వస్తుంది. అలానే ఆకుకూరలు లో పోలిక్ యాసిడ్, విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవి కూడా ఆరోగ్యానికి మంచిది. అదే విధంగా కాలిఫ్లవర్, బ్రోకలీ వారానికి రెండుసార్లు ఇవ్వడం మంచిది.

విటమిన్ సి ..
విటమిన్ సి కమలా, నిమ్మ, ద్రాక్ష వంటివాటిలో ఉంటుంది. అలానే జామకాయ, బొప్పాయి, టమోటా, బ్రోకలీ లో సమృద్ధిగా ఉంటుంది.

విటమిన్ డి ..
సూర్య కిరణాల ద్వారా విటమిన్ డి మందికి అందుతుంది. అలానే డైరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకోవడం మంచిది. విటమిన్-డి ఎముకల్ని దృఢంగా చేస్తుంది.

రైన్ కోట్..
జాకెట్ స్కూల్ కి వెళ్లేటప్పుడు వర్షంలో తడవకుండా.. రెయిన్ జాకెట్ వేయడం మంచిది. పాదాలు కూడా వర్షపు నీటిలో తడవకుండా.. వాటర్ ప్రూఫ్ షూ వాడితే అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

శుభ్రం..
పిల్లు బయటకు వెళితే ఆవి ఇవి ముట్టుకోవడం వల్ల పిల్లల చేతులు బ్యాక్టీరియా, వైరస్ లు నిండి ఉంటాయి. కాబట్టి అవి శరీరంలోకి చేరకుండా. చేతులు కడుక్కునే అలవాటు చేయాలి. అవి అనేక వ్యాధులకు కారణమవుతాయి. బయట నుంచి రాగానే చేతులు శుభ్రం చేసుకునే అలవాటు చేయాలి.

