వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో వాగ్నర్ వేసిన 37 ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అతను వేసిన రెండో బంతి రాకాసి బౌన్సర్‌గా పుజారా ముఖంపైకి దూసుకొచ్చింది. అయితే ఈ బంతిని పుల్ షాట్ ఆడబోయిన పుజారా.. అంచనా వేయడంలో విఫలమై అడ్వాన్స్ అయ్యాడు. దాంతో బంతి బ్యాట్ మిస్సై హెల్మెట్ గ్రిల్స్‌ను బలంగా తాకింది. ఆ దెబ్బకు హెల్మెట్ స్టెమ్ గార్డ్స్ విరిగి గాల్లో ఎగిరిపడ్డాయి. గ్రిల్స్ లేకుంటే పుజారా మూతి పచ్చడయ్యేది. వెంటనే టీమిండియా ఫిజియో మైదానంలోకి పరుగెత్తుకొచ్చి పుజారాను పరిశీలించాడు. ఎలాంటి గాయం కాకపోవడంతో పుజారా తన ఆటను కొనసాగిస్తున్నాడు. ఇక కంకషన్ నిబంధనల ప్రకారం బంతి తలకు తాకిన ప్రతీసారి ఫిజియో పరిశీలించాల్సిందే. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్ అయ్యాయి.
							previous post
						
						
					
							next post
						
						
					

