ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి గురువారం రాత్రి అమరావతికి చేరుకున్నారు. నేడు పార్టీ నేతలతో ఆయన బిజీగా గడపనున్నారు. లోక్‌సభ అభ్యర్థులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
తొలుత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల లోక్‌సభ స్థానాల పరిధిలోని అభ్యర్థులు, పార్టీ నేతలతో ఈరోజు ఉదయం అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో సమావేశం కానున్నారు. శని, ఆదివారాల్లో సమీక్షలకు విరామం ఇవ్వగా తిరిగి సోమవారం నుంచి సమీక్షలు పున: ప్రారంభం అవుతాయి. సోమవారం కడప, రాజంపేట లోక్‌సభ అభ్యర్థులతో సమీక్ష నిర్వహించనున్నారు.


అసెంబ్లీలో ప్రతిపక్ష గొంతు నొక్కేస్తున్నారు: చంద్రబాబు