భారతీయ జనతా పార్టీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
“హోంశాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా గారికి జన్మదిన శుభాకాంక్షలు. దేశ సేవలో మీరు ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను” అని చంద్రబాబు పేర్కొన్నారు.
జన్మదినం సందర్భంగా అమిత్ షాకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, నాయకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.