టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వేంకటేశ్వరుని దర్శించుకున్న ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుమల, రాష్ర్ట ప్రజలకు శుభం కలగాలని…. ప్రజల ఆరోగ్యంగా వుండాలని దేవుణి ప్రార్దించానని పేర్కొన్నారు. రాష్ట్రానికి వున్న పెద్ద ఆస్థి శ్రీవారు…. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడవలసిన బాధ్యత అందరి పై వుందని తెలిపారు. పింక్ డైమండ్ పోయ్యిందంటూ ఆరోపణలు చెసిన వ్యక్తిని తిరిగి చేర్చుకోవడం మంచి సంప్రదాయం కాదని.. మనిషిని దేవుడితో పోల్చడం మంచి పద్దతి కాదన్నారు. ఇలాంటి అపచారాలు గతంలో కూడా చేసారని ఫైర్ అయ్యారు. ఇక అంతకుముందు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక మరి కాసేపట్లో ఆయన తన ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
previous post
next post

