అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి అరుదైన గౌరవం లభించింది. ఆయన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్) ప్రతినిధులు అందించిన ధ్రువపత్రాన్ని నిన్న రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మే 21 నుంచి జూన్ 21 వరకు అన్నమయ్య జిల్లాలోనూ కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ క్రమంలో మే 28న గంటపాటు 13,594 మంది ఆరోగ్య కార్యకర్తలతో యోగా చేయించి కలెక్టర్ శ్రీధర్ చామకూరి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు పాల్గొన్నారు