శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పీటీఎం 2.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ హాజరయ్యారు.
పాఠశాలకు చేరుకున్న చంద్రబాబుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించిన సీఎం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. విద్యార్థుల చదువుతున్న తీరుపై ఆరా తీశారు. పిల్లల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించారు.
అనంతరం పాఠశాలలో ఒక్కొక్క తరగతి గదిని పరిశీలించిన సీఎం విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించారు. డిజిటల్ తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు.
8వ తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఈ సమయంలో మంత్రి లోకేశ్ పిల్లలతో కలిసి కూర్చొని శ్రద్ధగా పాఠం విన్నారు.
విద్యార్థులకు పాఠం బోధించిన అనంతరం సీఎం చంద్రబాబు పిల్లలను ప్రశ్నలు అడిగారు.
వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. పిల్లల సందేహాలను నివృత్తి చేశారు. భవిష్యత్తులు ఎలా ఎదగాలనుకుంటున్నారనే విషయాన్ని పిల్లలను అడిగి తెలుసుకున్నారు.
జీవితాలు బాగు పరుచుకునేందుకు బాగా చదువుకోవాలని సీఎం వారికి సూచించారు. విద్యార్థులతో కలిసి ఫొటోలు దిగిన సీఎం వారు తయారు చేసిన సైన్స్ నమూనాలను పరిశీలించారు.
మరింతగా ఉన్నతంగా ఎదగాలని ప్రోత్సహించారు.
పాఠశాలలు పవిత్ర దేవాలయాలని పిల్లల్ని తీర్చిదిద్ది జ్ఞానాన్ని అందించే పుణ్యక్షేత్రాలని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని 1998లో అనుకున్నట్లు చెప్పారు.
చదువుకుని పైకి వచ్చిన వారు స్కూళ్లకు ఎంతోకొంత చేయూత ఇవ్వాలని పిలుపునిచ్చారు.
మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదన్న సీఎం అందుకే ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామన్నారు.
కొత్తచెరువు జడ్పీ పాఠశాల పీటీఎంలో పాల్గొన్న విద్యార్థులు తాము చూసిన అనుభవాలను సీఎం చంద్రబాబుతో పంచుకున్నారు.
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టడం వల్ల తమలాంటి పేదవారికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు.
జగన్ పాలన చూసి నారా వారి నరాలు చిట్లిపోతున్నాయి: రోజా