telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీపీఎస్‌పై కమిటీ వేశాం.. సీఎంవో ముట్టడించాలని అనుకోవడం స‌రికాదు

ముఖ్య‌మంత్రి ఇళ్లు ముట్టడించాలనుకునే ఉపాధ్యాయులపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.  సోమవారం మీడియాతో మాట్లాడుతూ…సి.పి.ఎస్ అంశంపై ప్రభుత్వం కమిటీ వేసిందని చెప్పారు. కమిటీ అధ్యయనం తర్వాత సీపీఎస్‌అంశంపై ప్రభుత్వం స్పష్టత వస్తుందన్నారు. ఈలోపే ఉపాధ్యాయులు సీఎంవో ముట్టడిస్తానని చెప్పడం ధర్మమేనా అని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్య వ్యవస్ధలో ముఖ్యమంత్రి ఇళ్లు ముట్టడించాలనుకొనే చర్య అనడం సరికాదని అని ప్రశ్నించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగొంచదని ఉపాధ్యాయులను కోరారు. ఆందోళనలో జరగరానిది జరిగితే ఎవరూ బాధత్య వహిస్తారని ప్రశ్నించారు.

ప్రతి అంశాన్ని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. విద్యా శాఖలో సంస్కరణలు దశలు వారీగా వస్తాయన్నారు. 55 వేల ప్రభుత్వ స్కూళ్లను నాడు నేడు ద్వారా అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. ఉన్నత విద్యకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు.

సుయ్యి మంటే నాదో అట్టు అన్నట్టు తయారయ్యాయి మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయుల సెలవుపై టీడీపీ, బీజేపీ అనవసర రాదాంతం ఎందుకు చేస్తున్నాయని మండిపడ్డారు.

Related posts