సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
గోడ కూలి భక్తులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గోడ కూలి 8 మంది భక్తులు మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన నారాలోకేష్ మరియు పవన్ కళ్యాణ్.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ. 300 టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలి మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది.
గాయపడిన వారికి రూ. 3 లక్షల చొప్పున అందించనున్నట్టు తెలిపింది.
చంద్రబాబునాయుడు మంత్రులు, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పరిహారం అందజేయాలని ఆదేశించారు. అలాగే, బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించాలని సూచించారు.
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
సింహాచలంలో పరిస్థితిపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడానని, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించినట్టు తెలిపారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు చంద్రబాబు వివరించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు.

