బోయినపల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ వ్యతిరేకంగా అన్ని ఆధారాలు పక్కాగా ఉండడంతో ఆమెకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆమెను చంచల్గూడా మహిళా జైలుకు తరలించారు పోలీసులు. హైదరాబాద్ పోలీసులకు దొరకకుండా అఖిల ప్రియ భర్త, సోదరుడు తప్పించుకొని తిరుగుతున్నారు. అఖిల ప్రియ భర్తతోపాటు అనుచరుడు మాడల శ్రీను కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. నాలుగు రాష్ట్రాల్లో ఇద్దరి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. పుణే లోని ఒక హోటల్ నుంచి తృటిలో తప్పించుకున్నాడు మాడాల శీను. కిడ్నాప్ లో మొత్తం 23 మంది ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు తేల్చారు. భార్గవ్ తల్లిదండ్రులతో పాటు సోదరుని ఇప్పటికే నిందితులుగా తేల్చారు పోలీసులు. అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి, పేరును కూడా నిందితుల లిస్ట్ లో చేర్చారు పోలీసులు. అయితే ఇప్పటికి పరారీలో ఉన్న భార్గవ్, చంద్రాస్ , జగత్ విఖ్యాత రెడ్డి, మాడాల శ్రీను ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసారు పోలీసులు. అయితే ఈ కిడ్నాప్ కేసులో భార్గవరామ్, మాదాల శ్రీను, చంద్రహాస్ ప్రధాన నిందితులుగా ఉండగా.. అఖిలప్రియ కీలకంగా వ్యవహరించారు.
next post

