బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాతే వాటి విశిష్టత మరింత పెరిగిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
శుక్రవారం రాంగోపాల్‌పేట్ మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి నివాసం నుంచి యేటా మాదిరిగా ఈ ఏడాది కూడా తొలి బోనం ఉజ్జయినీ మహంకాళి అమ్మకు సమర్పించారు. ముందుగా పూజలు నిర్వహించారు.
తథనంతరం శ్యామలకు తలసాని శ్రీనివా్‌సయాదవ్ బోనమెత్తారు. డప్పు చప్పుళ్ల, నృత్యాలతో ఆలయానికి చేరుకుని బోనం సమర్పించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ఆషాఢ మాసం ప్రారంభమైతే బోనాల ఉత్సవాలతో జంటనగరాలు సందడిగా మారుతాయన్నారు.
మాజీ కార్పొరేటర్లు అత్తెల్లి మల్లికార్జున్‌గౌడ్, అత్తెల్లి అరుణశ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్‌కుమార్‌గౌడ్, శ్రీహరి, మహే్‌షయాదవ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

