telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎలక్షన్ కమిషన్‌ పై చంద్రబాబు ఫైర్

Chandrababu comments Jagan cases

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు ఎలక్షన్ కమిషన్‌ పై మండిపడ్డారు. ఇంత పనికిమాలిన ఎలక్షన్ కమిషన్‌ను తానెప్పుడూ చూడలేదన్నారు . నేరస్తుల కనుసన్నల్లో ఈసీ నడుస్తోందని దుయ్యబట్టారు. వాళ్లు ఎవరిని బదిలీ చేయమంటే వాళ్లను బదిలీ చేశారని చెప్పారు. ఈవీఎంలను రిపేర్‌ చేస్తామని చెప్పి ట్యాంపరింగ్ చేశారన్నారు. జగన్‌తో సహ నిందితుడిగా ఉన్నవారిని సీఎస్‌గా నియమిస్తారా? అని ప్రశ్నించారు. ఎన్నిక జరుగుతుంటే సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం-డీజీపీ ఆఫీసుకు ఎందుకెళ్లారని నిలదీశారు.

ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరారని, ఈవీఎంలు పనిచేయకపోవడంతో నానా ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రజలు దృఢ సంకల్పంతో ఓటేయడానికి వచ్చారన్నారు. ఇంతమందిని అంత ఉదయమే ఎప్పుడైనా చూశామా? అని అడిగారు. ఈవీఎంలు పనిచేయకపోతే మూడుసార్లు వెళ్లి మళ్లీ వచ్చారని స్పష్టంచేశారు. సీఈవోనే ఓటు వేయలేకపోయారని ఎద్దేవాచేశారు. ఇష్టమొచ్చినట్లు ఈవీఎంలు రీప్లేస్ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒంటిగంటకు పోలింగ్ ప్రారంభించి సాయంత్రం 6 గంటలకు ముగిస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ప్రజల భవిష్యత్‌ని ఒక మిషన్‌ మీద వదిలిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts