ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో ఓ మసీదు వద్ద భారీ విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో 14 మంది మరణించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈద్గా మసీదు ప్రధాన ద్వారం వెలుపల జరిగిన ఈ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చని తెలుస్తోంది.
పెద్దసంఖ్యలో గాయపడగా, వారిని అంబులెన్సుల ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి ఘటనను తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
కొందరు ఈ పేలుడును ఆత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నారు. ఓ సూసైడ్ బాంబర్ మసీదు ఎంట్రెన్స్ వద్ద తనను తాను పేల్చుకుని దారుణానికి ఒడిగట్టాడని చెబుతున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
శాసన మండలిని రద్దు చేయడం జగన్ వల్ల కాదు: యనమల