తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి భారీ ఊరట లభించింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ (డీసీహెచ్ఎల్) యాజమాన్యంకు రూ.4,800 కోట్లు చెల్లించాలంటూ గతంలో బీసీసీఐకి ఆర్బిటర్ ఇచ్చిన ఆదేశాలను (మధ్యవర్తిత్వ ఉత్తర్వులను) బాంబే హైకోర్టు కొట్టిపారేసింది. జస్టిస్ జీఎస్ పటేల్‌తో కూడిన బెంచ్ తాజా ఆదేశాలను జారీ చేసింది. కోర్టు తీర్పు సంతోషకరంగా ఉందని, తాము అన్నీ అగ్రిమెంట్ ప్రకారమే చేశామని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్లో 2008 నుంచి 2012 వరకు ఐదేళ్ల పాటు దక్కన్ చార్జర్స్ జట్టు కొనసాగింది. 2009లో చాంపియన్‌గా కూడా నిలిచింది. డీసీహెచ్ఎల్ కంపెనీ ఈ టీమ్‌ను ప్రమోట్ చేసింది. అయితే 2012లో రూ.100 కోట్ల బ్యాంకు గ్యారంటీని చూపించడంలో విఫలమైందంటూ బీసీసీఐ షోకాజ్ నోటీసు ఇవ్వడంతో వివాదం తలెత్తింది. వివరణ కోసం చార్జర్స్‌కు 30 రోజుల గడువు ఇచ్చినా.. అది పూర్తి కాకముందే టీమ్‌ను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. 2012 సెప్టెంబరులో ఆ జట్టును ఐపీఎల్ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.
							previous post
						
						
					
							next post
						
						
					


జగన్, కేసీఆర్ చొరవను అభినందిస్తున్నా: కేశినేని నాని