భారతీయ జనతా పార్టీకి చెందిన అధికారిక వెబ్‌సైట్ మంగళవారం హ్యాకింగ్‌కు గురైంది. వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారంటూ కొందరు సోషల్ మీడియా యూజర్లు రిపోర్ట్ చేశారు. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీకు చెందిన మేమ్స్‌ను పోస్ట్ చేశారని సదరు యూజర్లు వాటి స్క్రీన్‌షాట్లను బయటపెట్టారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో బీజేపీ అధికారిక వెబ్‌సైట్ హ్యాక్ కావడం ప్రాధాన్యత సంతరించకుంది. ఇటీవల పలు భారత ప్రభుత్వ వెబ్‌సైట్లను పాకిస్తాన్‌కు చెందిన హ్యాకర్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో బీజేపీ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయగా ప్రధాని నరేంద్ర మోదీ, జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌ల వీడియా అభ్యంతరకర పదజాలంతో కనిపించిందని హిందీ న్యూస్ వెబ్‌సైట్ అమర్ ఉజాలా పేర్కొంది. ఆ తర్వాత కొద్దిసేపటికే వెబ్‌సైట్ అందుబాటులో లేదని ఎర్రర్ మెసేజ్ చూపిందని ఆ వెబ్‌సైట్ తెలిపింది. దీంతో వెంటనే స్పందించిన బీజేపీ తమ వెబ్‌సైట్‌ను వెంటనే నిలిపేసింది.

