అధికారులు మాట వినకపోతే చెప్పుతో కొట్టాలంటూ ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని లలిత్‌పూర్ బీజేపీ ఎమ్మెల్యే రామ్ రతన్ కుష్వాహ తన కార్యకర్తలతో మాట్లాడుతున్న ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని అధికారులు ఒక నెలలో పని మొదలు పెట్టకపోయినా, మా పార్టీ కార్యకర్తలను వేధింపులకు గురిచేసినా, అక్కడే మీ చెప్పులు తీసి వారిని కొట్టండన్నారు.
ఎందుకంటే సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది. ఎస్పీ, బీఎస్పీలకు విధేయులైన కొందరు అధికారులు ఎన్నికల్లో వ్యవహరించిన మాదిరిగానే మీ పట్ల దురుసుగా వ్యవహరిస్తారు. వాళ్లతో జాగ్రత్తగా ఉండండని ఆయన చెప్పుకొచ్చారు. యూపీ అధికారులపై బీజేపీ నేతలు నోరు జారడం కొత్తేం కాదు. ప్రియాంక రావత్ సహా పలువురు బీజేపీ నేతలు గతంలో ఉన్నతాధికారులపై బెదిరింపులకు పాల్పడ్డారు.
23 తర్వాత ఏపీ పౌరుషం ఏంటో తెలుస్తుంది: యామిని