telugu navyamedia
సినిమా వార్తలు

నా కొడుకు చావుకు కారణం వాళ్లే… : తేజ

Teja

దర్శకుడు తేజ ఇటీవల “సీత” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన కొడుకు ఎలా చనిపోయాడో తెలియజేస్తూ ఓ యూట్యూబ్ ఛానెల్ కి అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఈ ఇంటర్వ్యూలో తన కొడుకు మరణం గురించి తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తన కొడుక్కి నాలుగేళ్ల వయసులో అనారోగ్యంగా ఉండడంతో హాస్పిటల్ లో చేర్పించామని, ట్రీట్మెంట్ లో డాక్టర్స్ చేసిన మిస్టేక్ కారణంగా అతడి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, తన కొడుకుని కాపాడుకోవడం కోసం జర్మనీ, చైనా దేశాలు తీసుకెళ్లామని, అయినా బ్రతికించుకోలేకపోయామని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. తన కొడుకు కోసం ఆక్సిజన్ మిషన్, జనరేటర్, క్లీనింగ్ మిషన్ వీటన్నింటితో ఇంటినే హాస్పిటల్ గా మార్చేశామని, నాలుగేళ్ల పాటు సరిగ్గా నిద్రపోలేదని అన్నారు. 24 గంటల పాటు మూడు షిఫ్ట్ లలో ఇద్దరు నర్సులు ఉండేవారని, ఒక డ్రైవర్ ఉండేవారని, ఆ సమయంలో రాత్రి, పగలూ చాలా కష్టపడ్డామని చెప్పారు. నాలుగేళ్లపాటు సినిమాలు చేయలేదని, ఆ హాస్పిటల్ పై కేసు వేయమని చాలా మంది చెప్పారని, కేసు వేస్తా కానీ డబ్బుల కోసం కాదు… నా కొడుకు బతికివస్తాడంటే వేస్తానని వారితో చెప్పానని గుర్తు చేసుకున్నారు తేజ.

Related posts