telugu navyamedia
ఆంధ్ర వార్తలు

న‌న్నే ఆపుతారా అంటూ పోలీసుల్ని నెట్టేసిన సోము వీర్రాజు ..

*అమ‌లాపురం వెళ్ళేందుకు సోము వీర్రాజు ప్ర‌య‌త్నం..
*144 సెక్ష‌న్ ఉంద‌ని..అనుమ‌తి లేద‌ని ఆపిన పోలీసులు
*న‌న్నే ఆపుతారా అంటూ పోలీసుల పై వీర్రాజు ఆగ్ర‌హం
*విధుల్లో ఉన్న ఎస్ ఐని తోసేసిన సోము వీర్రాజు..
*రోడ్డుపై ఆగిన వ్యాన్ డ్రైవ‌ర్ పైన వీర్రాజు ఆగ్ర‌హం

ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజుకు పోలీసులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రావులపాలెం వెళ్తున్న సమయంలో  జొన్నాడ వద్ద భారీ కంటెయినర్ పెట్టి సోము వీర్రాజు కారును పోలీసులు అడ్డుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు

144 సెక్ష‌న్ ఉంద‌ని..అనుమ‌తి లేద‌ని పోలీసులు తెలిపారు. వారితో వాగ్వివాదానికి దిగిన బీజేపీ నేత తన దారికి అడ్డు తప్పుకోవాలంటూ పోలీసులను తోసేశారు. దీంతో పోలీసులకూ, సోము వీర్రాజుకు మధ్య కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Police obstructs BJP Andhra Pradesh Chief Somu Veerraju At Jonnada

వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు మీకు ఎవరిచ్చారు? అడుగడుగునా ఆంక్షలతో పోలీసు భద్రత మధ్య రాష్ట్రాన్ని ఎంతకాలం పాలిస్తారు? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామని ఉద్రిక్త పరిస్థితులను నిర్మాణం చేయదలచుకోలేదని ఎస్పీ స్థాయి అధికారికి వివరణ ఇచ్చిన తర్వాత కూడా ఈ ఆంక్షలెందుకు?’ అని వైసీపీ ప్ర‌భుత్వాన్ని ఏపీ పోలీసు శాఖను సోము వీర్రాజు ప్రశ్నించారు.

Image

కార్యకర్తలు కుటుంబాన్ని పరామర్శిస్తుంటే పోలీసు శాఖ ద్వారా ఈ దుందుడుకు చర్యలు మీ ప్రభుత్వం పాలన, అసమర్ధతను బయటపెడుతున్నాయి రాష్ట్రంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో ప్రభుత్వ నిఘా వర్గాలకు కూడా తెలియని స్థాయికి రాష్ట్ర పాలన దిగజారిందనే విషయాన్ని మీ చర్యలు అద్దం పడుతున్నాయ‌ని సోము మండిప‌డ్డారు.

Related posts