telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వేగవంతం.. సంచ‌ల‌నం రేపుతున్నసీబీఐ ఎంక్వైరీ

వైఎస్ వివేకా హత్యకేసులో మరోసారి ఉత్కంఠ కొనసాగుతోంది. వివేకా పీఏ ఇనయతుల్లాను పులివెందులలోని ఆర్‌ అండ్ బీ గస్ట్ హౌస్‌లో మంగళవారం రెండు విడతలుగా సీబీఐ అధికారులు విచారించారు. మంగళవారం ఉదయం ఇనయతుల్లాను అధికారులు మ‌రోసారి విచారించారు. అనంతరం ఇనయతుల్లా, ప్రభుత్వ సర్వేయరు, వీఆర్వో, ప్రైవేట్‌ ఫొటో గ్రాఫర్‌లను సీబీఐ అధికారులు తమ వాహనాల్లో వెంటబెట్టుకొని పలు ప్రాంతాలను పరిశీలించారు.

వైఎస్ వివేకా ఇంటితో పాటు నిందితుల ఇళ్ల కొల‌తలు అధికారుల బృందం కొలిచినట్టుగా తెలిసింది. వైఎస్ వివేకా వ్య‌క్తిగ‌త స‌హాయ‌కుడు ఇన‌య‌తుల్లాతో పాటు రెవెన్యూ అధికారులు, స‌ర్వేయ‌ర్ల‌తో చ‌ర్చించారు. ఆ త‌రువాత డాక్ట‌ర్ ఈసీ గంగిరెడ్డి హాస్పిట‌ల్‌, వివేకా సన్నిహిత మిత్రుడు ఎర్ర గంగిరెడ్డి ఇల్లు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి నివాసాల వద్ద సీబీఐ బృందం సర్వే కొలతలు నిర్వహించింది.

వైఎస్ వివేకా మ‌ర్డ‌ర్ జ‌రిగిన తీరుపై సీన్ రీక‌న్‌స్ర్ట‌క్ష‌న్ చేశారుజ. ఇప్ప‌టివ‌ర‌కు ద‌ర్యాప్తులో తేలిన స‌మాచారం మేర‌కు ఆయా ప్రాంతాల్లో వీడియో రికార్డింగ్ చేశారు. అలాగే కొన్ని ముఖ్య‌మైన ప్ర‌దేశాల్లో ఫోటోలు తీసుకోవ‌డంతో మరోసారి సీబీఐ విచారణ చర్చనీయాంశంగా మారింది. పులివెందుల్లో అనుమానితులు, నిందితుల నివాసాల వద్ద కూడా సీబీఐ పరిశీలనతో.. వారిలో ఆందోళన మొదలైంది.

మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వేసిన పిటిషన్‌పై కడప కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రస్తుతం కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి తనకు జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం కోర్టులో వాదనలు కొనసాగాయి. ఇక, ఇందుకు సంబంధించిన తదుపరి విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీస్తున్నారు.

Related posts