telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

ధోనీకి బర్డ్ ఫ్లూ సెగ.. వైరస్ దెబ్బకు అంతా తలకిందులు !

Ms dhoni cricketer

గత ఏడాది నుండి కరోనాతో దేశం అనేక ఇబ్బందులు పడుతున్నది. కేసులు సంఖ్య తగ్గుముఖం పడుతుండటంతో ఇప్పుడిప్పుడే ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో కొత్త స్ట్రెయిన్ కేసుల రాకతో ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యి. అదే సమయంలో బర్డ్ ఫ్లూ వైరస్ కూడా భయపెడుతున్నది. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఈ వైరస్ బయటపడింది. ఈ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పక్షులు మృతి చెందుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. అయితే.. తాజాగా టీం ఇండియా మాజీ కెప్టెన్‌ ధోనికి బర్డ్‌ ఫ్లూ టెన్షన్‌ పట్టుకుంది. ధోని ప్రారంభించిన కోళ్ల వ్యాపారానికి బర్డ్‌ఫ్లూ సెగ తగిలింది. బర్డ్‌ ఫ్లూ వైరస్‌ దేశంలో విస్తరిస్తున్న నేపథ్యంలో ధోని ఆర్డర్‌ చేసిన రెండు వేల కడక్‌ నాథ్‌ కోళ్లను, గ్రామప్రియ కోళ్ల ఆర్డర్‌ను రద్దు చేసుకున్నట్లు ధోని ఫాం హౌజ్‌ ప్రతినిధి పేర్కొన్నారు. ధోని కొనుగోలు చేసిన కోళ్లు రవాణాకు సిద్ధమైన తరుణంలో బర్డ్‌ ఫ్లూ బారీన పడ్డాయని కోళ్ల పెంపకదారుడు డాక్టర్‌ విశ్వరాజన్‌ ధృవీకరించారు. దీంతో కోళ్ల ఆర్డర్‌ను పూర్తిగా ధోని రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ బర్డ్‌ ఫ్లూ ప్రభావం ముఖ్యంగా మధ్య ప్రదేశ్‌, కేరళ, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. కాగా.. ఇటీవలే క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన ధోనీ, రాంచీలోని తన 43 ఎకరాల ఫాం హౌజ్‌లో ఆర్గానిక్‌ పౌల్ట్రీ పరిశ్రమను నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే బర్డ్‌ ఫ్లూ ఈ మాజీ కెప్టెన్‌ బిజినెస్‌కు తల నొప్పిగా మారింది.

Related posts