తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ,మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు మృతిచెందడం పార్టీకి తీరని లోటని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర టిడిపి అధ్యక్షులు శ్రీనివాసులు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి లు పేర్కొన్నారు.
బుధవారం రాయచోటి పట్టణంలోని దివంగత మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు భౌతిక కాయానికి మంత్రులు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ సుగవాసి పాలకొండ్రాయుడు మృతి చెందడంతో రాష్ట్రం ఒక గొప్ప నాయకున్ని కోల్పోయిందన్నారు.
వారి మరణం రాష్ట్రానికి టిడిపికి తీరని లోటని సుగువాసి పాలకొండ్రాయుడు గత నాలుగు శతాబ్దాలుగా తన రాజకీయ జీవితం ప్రజలకు అంకితం చేసి ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన ఒక గొప్ప వ్యక్తి అన్నారు.
ఆయన మరణం చాలా బాధాకరమని వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.
రాష్ట్ర టిడిపి అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ సుగవాసి పాలకొండ్రాయుడు ఎంపీగా ఎమ్మెల్యేగా పార్టీకి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు.
ఆయన మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నానన్నారు.
భగవంతుడు వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు పాలకొండ్రాయుడు భౌతిక కాయాన్ని సందర్శించి ఘన నివాళులర్పించడం జరిగిందన్నారు.
అనంతరం రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ సుగవాసి పాలకొండ్రాయుడు మరణం రాష్ట్రానికే కాదు టిడిపికి తీరని లోటన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నానన్నారు. సుగువాసి పాలకొండ్రాయుడు గతంలో బీసీల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేయడం జరిగిందన్నారు.
ఆయన మరణించినప్పటికీ ఎల్లవేళలా మా గుండెల్లో ఉంటారన్నారు. వారి కుటుంబానికి ఎల్లవేళలా టిడిపి పార్టీ సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
ఈ కార్యక్రమంలో పుంగనూరు టిడిపి ఇన్చార్జి చల్లా బాబు, పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.