పాప్ సింగర్, బార్బేడియన్ నటి రిహన్న కూడా రైతుల ఉద్యమానికి మద్దతు తెలిపారు. భారత ప్రధానిపై విమర్శలు సందించారు. అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైన రైతుల ఉద్యమాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి, దీనిపై మనం ఎందుకు స్పందించకూడదు అని ప్రశ్నించారు. ఈ ట్వీట్ తరువాత ఉద్యమంపై అంతర్జాతీయంగా మద్దతుపెరుగుతూ వస్తున్నది. బార్బేడియన్ పాప్ సింగర్ రిహాన్న భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ట్వీట్ చేస్తే, ఆ దేశ ప్రధాని మియా అమోర్ మోటర్లీ భారత ప్రధానికి థ్యాంక్స్ చెప్తూ లేఖ రాశారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో ఇండియా ప్రపంచంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఇండియాలో రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. భారత్ వీటిని వినియోగిస్తునే, వివిధ మిత్రదేశాలకు వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే బార్బేడియన్ దేశానికి లక్ష కరోనా వ్యాక్సిన్ టీకాలను ఉచితంగా అందజేసింది. కోవీషీల్డ్ వినియోగానికి బార్బేడియన్ ఆరోగ్యశాఖ ఆమోదం లభించిందని, ఇండియా అందించిన వ్యాక్సిన్ తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ దేశ ప్రధాని మియా అమోర్ మోటర్లీ లేఖలో పేర్కొన్నారు. చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.
previous post

